రీషెడ్యూల్ చేసినా రుణాలు డౌటే.. | Sakshi
Sakshi News home page

రీషెడ్యూల్ చేసినా రుణాలు డౌటే..

Published Mon, Jul 14 2014 4:06 AM

reschedule Turns loans ..

రైతు రుణాల మాఫీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. రుణమాఫీకి రిజర్వ్‌బ్యాంకు తిరకాసు పెడుతుండటంతో.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని రీషెడ్యూల్ చేసి తాత్కాలిక ఉపశమనం పొందే యత్నం చేస్తోంది. కరువు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన చోటే రీషెడ్యూల్‌కు అవకాశముండగా.. కరువు ప్రాంతాల ఎంపికలో ప్రభుత్వం అనుసరించిన విధానంతో రైతులకు పెద్దగా ప్రయోజనం దక్కే అవకాశం కనిపించడం లేదు.
 
 ప్రభుత్వం గద్దెనెక్కి నెలన్నర కావస్తుండగా రైతుల రుణమాఫీపై అస్పష్టత కొనసాగుతూనే ఉంది. మాఫీకి బదులు రీషెడ్యూల్ చేయనున్నారనే వార్తలు జిల్లా రైతుల్లో గుబులు పుట్టిస్తున్నా యి. కరువు మండలంగా ప్రకటిస్తేనే రీషెడ్యూల్‌కు అవకాశముంటుంది. అతివృష్టి లేదా అనావృష్టి వల్ల పంటలు దెబ్బతిని, బ్యాంకుల్లో రైతు లు తీసుకున్న రుణాలు కట్టలేని పరిస్థితిలో ఉంటే ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటిస్తుంది. ప్రభుత్వం కోరితే రిజర్వ్‌బ్యాంకు నిబంధనల ప్రకారం.. పంట రుణాలు ఇచ్చిన బ్యాం కులు... ఈ కరువు మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్ చేస్తాయి. గత అక్టోబర్‌లో జిల్లాలో పైలిన్ తుపాన్ ప్రభావంతో నష్టం జరగ్గా దానిని ప్రమాణికంగా తీసుకున్న ప్రభుత్వం... జిల్లాలో 57 మండలాలుండగా పంటనష్టం జరిగిన 50 మండలాలను కరువు మండలాలుగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీషెడ్యూల్ చేయాల్సి వస్తే ఎంత మొత్తం అవుతుందనే అంచనాలు రూపొందిం చుకునేందుకు ప్రభుత్వం బ్యాంకులను లెక్కలు కోరింది. కరువు మండలాల జాబితాను బ్యాం కులకు పంపించింది. ఆయా మండలాల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు ఎంతమంది? తీసుకున్న రుణం ఎంత? ఆఘమేఘాల మీద తెలపాలంటూ బ్యాంకులను కోరింది.
 
 అలాగైతే అన్యాయమే
 కరువు మండలాల జాబితా ప్రకారం రుణాలు రీషెడ్యూల్ చేస్తే జిల్లా రైతులకు అన్యాయం జరిగే ప్రమాదముంది. జిల్లాలో మెజారిటీ మం డలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించినా... ఆ మండలంలోని కొన్ని గ్రామాలనే కరువు గ్రా మాలుగా చూపింది. తుపాన్‌తో మండలం మొత్తం పంట నష్టపోనందున ఏఏ గ్రామాల్లో నష్టం జరిగిందో అదే గ్రామాలను కరువు గ్రా మాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
 
 జిల్లాలో 1200కు పైగా గ్రామాలకు గాను 979 గ్రామాలను మాత్రమే కరువు ప్రాంతాలుగా గుర్తించా రు. దీంతో రుణాలు రీషెడ్యూల్ చేస్తే బ్యాంకు లు కరువు గ్రామాలుగా ప్రకటించిన గ్రామ రైతుల రుణాలనే రీషెడ్యూల్ చేసి కొత్త రుణాలు ఇస్తాయి. మిగతా గ్రామ రైతులకు మొండిచె య్యే ఎదురుకానుంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో మండలానికి నాలుగైదు గ్రా మాలనే ఈ జాబితాలో చేర్చారు. ఉదాహరణకు జగిత్యాల నియోజకవర్గంలోని జగిత్యాల మండలంలో 31 గ్రామాలుండగా కేవలం నాలుగే(బాలెపల్లి, ధర్మారం, కన్నాపూర్, తిమ్మాపూర్) గ్రామాలను మాత్రమే కరువు గ్రామాలుగా గుర్తించారు.
 
 రాయికల్ మండలంలో 27 గ్రామాలుండగా... కట్కపూర్, తాట్లవాయి, రాజ్‌నగర్, ఆలూర్ గ్రామాలను, సారంగాపూర్ మండలంలో 22 గ్రామాలుండగా తుంగూర్, బట్టపల్లి, పోతారం, సారంగాపూర్, అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల గ్రామాలను కరువు గ్రామాలుగా ప్రకటించారు. కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో... గ్రామాలకు గాను ఐలాపూర్, పెద్దపూర్‌లు మాత్రమే కరువు జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలాలు అసలు కరువు మండలాల జాబితాలోనే లేవు. వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండలం కూడా జాబితాలో లేదు. దీంతో మెజారిటీ గ్రామాల్లో రుణాలు రీషెడ్యూల్ అయ్యే అవకాశం లేకపోగా రైతులకు కొత్త రుణా లు అందే అవకాశం లేదు. ఫలితంగా వారు మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పేలా లేదు. ఒక వేళ రీషెడ్యూల్ చేస్తే కరువు గ్రామాలు కాని రైతుల రుణాలను మాఫీ చేస్తారా? లేక ఏం చేస్తారనే విషయంపై స్పష్టత లేకపోవడంతోఆందోళనకు గురవుతున్నారు.
 
 రీ-షెడ్యూల్ అంటే..
 సాధారణంగా బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాన్ని అదే ఏడాది చెల్లించాల్సి ఉంటుంది. కానీ, రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే తీసుకున్న రుణాన్ని 3 నుంచి 5 ఏళ్లలో వాయిదాల పద్ధతి లో చెల్లించేందుకు అవకాశం ఇవ్వడంతోపాటు నూతనంగా అంతే మొత్తం రుణాన్ని పెట్టుబడి కోసం మళ్లీ ఇస్తారు. కానీ, దీనికి(ముందుగా తీసుకున్న రుణానికి) ప్రస్తుతమున్న రేటు ప్రకా రం 12.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
 
 
 దీంతో పంట రుణం కాస్తా... టర్మ్ లోన్‌గా మా రుతుంది, తర్వాత ఇచ్చే రుణం పంట రుణంగా మారుతుంది. రీషెడ్యూల్ చేస్తే బకాయిలను ప్రభుత్వమే దశలవారీగా చెల్లించుకోవచ్చని భా విస్తోంది. ఒకవేళ రైతులు చెల్లించినా... వారి ఖా తాల్లో డబ్బు జమ చేసే ఆలోచనలో ఉంది. ప్ర భుత్వం వెంటనే స్పష్టత ఇచ్చి రుణాలు మొత్తం మాఫీ చేయాలని రైతులు కోరుతున్నారు. వర్షాలు పడుతున్నందున పెట్టుబడికి ఇబ్బంది కాకుండా బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement