రేషన్ బియ్యం లారీ పట్టివేత | ration rice caught in karim nagar district | Sakshi
Sakshi News home page

రేషన్ బియ్యం లారీ పట్టివేత

Jan 20 2016 9:01 AM | Updated on Sep 3 2017 3:59 PM

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజుపల్లి శివారులోని శ్రీవైష్ణవి రైస్ మిల్లు వద్ద రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ముంజుపల్లి శివారులోని శ్రీవైష్ణవి రైస్ మిల్లు వద్ద రేషన్ బియ్యం లారీని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. లారీలో లోడ్‌ చేసిన రేషన్ బియ్యం బస్తాలను రైస్ మిల్లుకు తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో బుధవారం ఉదయం అధికారులు దాడి చేశారు. అధికారులను చూసిన లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీని మానకొండూరు రెవెన్యూ కార్యాలయానికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement