బాలికపై అత్యాచారయత్నం | rape attempt on fifth class girl | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం

Jan 20 2015 1:25 AM | Updated on Jul 28 2018 8:40 PM

బాలికపై అత్యాచారయత్నం - Sakshi

బాలికపై అత్యాచారయత్నం

బాబాయి వరుసయ్యే ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.

వరుసకు బాబాయే నిందితుడు
 పరిగి: బాబాయి వరుసయ్యే ఓ వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా పరిగి మండల పరిధిలోని మల్లెమోనిగూడలో సోమవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ బాలిక(10) స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. గత గురువారం మధ్యాహ్నం సంక్రాంతి రోజున కుటుంబీకులు తమ పనుల్లో నిమగ్నమై ఉండగా ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది.

అదే సమయంలో ఆమెకు వరుసకు బాబాయి అయ్యే అల్లాడి వెంకటేష్(25) ఇంట్లోకి చొరబడి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. భయపడిన బాలిక కేకలు వేయడంతో కుటుంబీకులు వచ్చారు. అంతలోనే వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. పండగ ఉండటంతో గ్రామస్తులు, బంధువుల ఒత్తిడి మేరకు బాధితురాలి కుటుంబీకులు అదేరోజు ఫిర్యాదు చేయలేకపోయారు. ఎట్టకేలకు ధైర్యం చేసి సోమవారం పరిగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు త్వరలోనే నిందితుడిని పట్టుకొని రిమాండుకు తరలిస్తామని ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement