అదుపు తప్పిన డ్రోన్‌: పరిగి ఎమ్మెల్యేకు గాయాలు | Runaway Drone Injures Parigi MLA In Telangana | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన డ్రోన్‌: పరిగి ఎమ్మెల్యేకు గాయాలు

Apr 19 2026 6:30 PM | Updated on Apr 19 2026 6:41 PM

Runaway Drone Injures Parigi MLA In Telangana

వికారాబాద్‌: జిల్లాలోని కుల్కచర్లలో డ్రోన్‌ ట్రయల్‌రన్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. డ్రోన్‌ ఎగరేసే సమయంలో అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి కాలికి గాయమైంది. డ్రోన్‌ రెక్కలు తెగడంతో ఎమ్మెల్యే అనుచరులు ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుమలపూర్ వెంకటయ్య గౌడ్  కాలుకు , రాంపూర్ సర్పంచు తిరుపతయ్యకు చేతికి గాయాలయ్యాయి. 

ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ట్రాయల్ రన్ చేస్తుండగా ఒక్కసారిగా డ్రోన్‌ ఒక్కసారిగా అదుపు తప్పింది. నేరుగా ఎమ్మెల్యే మీదకి వచ్చేసింది డ్రోన్‌. దాంతో ఎమ్మెల్యే కాలికి డ్రోన్ రెక్కలు తగలగా, మరొకరికి చేతి బ్రొటన వేలు తెగిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి కాలికి తీవ్ర రక్తగాయమైనట్లు సమాచారం.

సబ్సిడీపై పంట పొలాలకు మందులు పిచికారి చేసే డ్రోన్‌ను నిరుద్యోగ యువకుడు తెచ్చుకున్నాడు. ఆ డ్రోన్‌ను ప్రారంభించడానికి వెళ్లారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి.  డ్రోన్‌ ఆపరేటింగ్‌లో ఇబ్బందులు తలెత్తాయి. 


 

Advertisement
 
Advertisement
Advertisement