కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని వైఎస్సాఆర్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి అన్నారు.
కుత్బుల్లాపూర్(రంగారెడ్డి) : కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారని వైఎస్సాఆర్ సీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేష్‌రెడ్డి అన్నారు. సోమవారం సూరారం కాలనీ డివిజన్ మరాఠీ బస్తీలో ఆయన పాదయాత్ర నిర్వహించగా... స్థానికులు ఎదుర్కుంటున్న పలు సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి.
డ్రైనేజీ సౌకర్యం లేక రోడ్లపై డ్రైనేజీ నీరు ప్రవహిస్తుందని, త్రాగడానికి నీరు కరువైందని, బోర్లు, డ్రైనేజీ పనులు త్వరితగతిన చేయించాలని స్థానికులు సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా సురేష్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కార్పొరేటర్‌గా పని చేసిన తాను అన్ని కాలనీల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేశానని, సుమారు రూ.2 కోట్ల విలువ చేసే పనులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, దీనికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని అన్నారు.