ప్రతినాయక పాత్రల ‘ప్రతిధ్వండి’

Ramayanam Programme In Ravindra Bharathi - Sakshi

నాలుగు శైలిల్లో ‘ప్రతిధ్వండి రామాయణం’

నేడు రవీంద్రభారతిలో ప్రదర్శన  

రామాయణం ఆధారంగా ఎన్నోనాటక ప్రదర్శనలు రూపొందాయి.కానీ తొలిసారి రామాయణంలోని ప్రతినాయక పాత్రలతో ‘ప్రతిధ్వండి రామాయణం’ ప్రదర్శించనున్నారు. రామాయణంలోని ప్రతినాయక
పాత్రలైన మందర, కైకేయి, శూర్పణక, రావణ, సూత్రధార్‌ల ఆధారంగా కథక్, కూచిపూడి, మోహినీయాట్టం, భరతనాట్యం శైలుల్లో ఈ నాటక ప్రదర్శనకొనసాగుతుంది. దీపాంజలి స్కూల్‌ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ కూచిపూడి, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6:30గంటలకు రవీంద్రభారతిలోప్రదర్శించనున్న ఈ నాటకవిశేషాలివీ...  

సాక్షి, సిటీబ్యూరో : ‘ఏడాది క్రితం అంతర్జాతీయ కళాకారిణి గోపికావర్మ నాకు ఫోన్‌ చేసి రామాయణంలోని ప్రతినాయక పాత్రలు మందర, కైకేయి, çశూర్పనక, రావణ, సూత్రధార్‌లపై  ‘ప్రతిధ్వండి రామాయణం’ పేరుతో నృత్యరూపకం చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. నేను వెంటనే చేద్దామన్నాను. వాల్మీకి, తులసి తదితర రామాయణ గ్రంథాలను పరిశోధించి నృత్యరూపకం రూపొందించామ’ని చెప్పారు ప్రముఖ నృత్యగురువు దీపికారెడ్డి తెలిపారు. ‘దీపికారెడ్డి దీని గురించి నాతో చెప్పగానే ఒప్పేసుకున్నాను.

నాకు సూర్పనక పాత్ర కేటాయించార’ని చెప్పారు కేరళకు చెందిన ప్రముఖ నృత్యగురువు దీపికావర్మ. ‘రామాయణంలోని ప్రతినాయక పాత్రల్లో చాలా రసాలు ఉన్నాయి. నేను మందర పాత్రకు సరిపోతానని దీపికారెడ్డి చెప్పగానే సరేనన్నాను’ అని చెప్పారు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత ఉమా డోగ్రా. రామాయణంలోని ముఖ్యమైన రావణ పాత్రను భరతనాట్య శైలిలో ప్రదర్శిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు ప్రముఖ నృత్యగురువు దీపక్‌ మజుందార్‌. ‘దీపికారెడ్డి ఫోన్‌ చేసి ‘ప్రతిధ్వండి’ గురించి చెప్పారు. అందులో ‘సూత్రధార్‌’ పాత్రకు నేను సరిపోతానన్నారు. ఇక వెంటనే ఒప్పేసుకున్నాను’ అని చెప్పారు యాంకర్‌ ఝాన్సీ. ఈ పాత్రలకు అనుగుణంగా స్రిప్ట్‌ రాయించుకున్న తాము... రిహార్సల్స్‌ చేసి నాటక ప్రదర్శనకు సిద్ధమయ్యామని కళాకారులు తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top