నాన్నా మద్యం తాగొద్దు.. | Rally Against Drink | Sakshi
Sakshi News home page

నాన్నా మద్యం తాగొద్దు..

Jun 25 2018 4:05 PM | Updated on Oct 16 2018 3:15 PM

 Rally Against Drink - Sakshi

కోహీర్‌ మండలం ఖానాపూర్‌లో నిర్వహించిన ర్యాలీ 

కోహీర్‌(జహీరాబాద్‌) సిద్ధిపేట :  ‘‘నాన్నలారా మీరు మద్యం(సారా) తాగడం ద్వారా ఎవరికీ ప్రయోజనం లేదు. నాన్న మీరు తాగి ఇంట్లో గొడవ పడుతుంటే మేము బిక్కు బిక్కుమంటూ ఏడ్చుకుంటూ కూర్చుంటున్నాము. నాన్న మీరు ఇంటికి శిరస్సు(తల) అని బైబిల్‌ చెబుతోంది.  కుంటుంబానికి తలగా ఉండాల్సిన మీరే ఇలా చేస్తే మమ్మల్ని పట్టించుకొనేది ఇంకెవరు.

ఫ్లీజ్‌ నాన్న మీ కాళ్లు పట్టుకొంటాము.. దయచేసి మద్యాన్ని(సారా) తాగడం ఆపేయండి నాన్న. ఐ లవ్‌ యూ నాన్న’’ అంటూ రాసిన బ్యానర్‌ ఆకట్టుకుంది. మండలంలోని ఖానాపూర్‌కు చెందిన ‘సండే స్కూల్‌’ విద్యార్థులు స్కూల్‌ పాస్టర్‌ రమేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇలా వినూత్న రీతిలో గ్రామ ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులను మద్యం మాన్పించి వారిలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో నిర్వహించిన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకొంది.

విద్యారులు చేసిన ఈ చిన్న ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశమైంది. మరి చిన్నారులు చేసిన ఈ వినూత్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement