ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగారిస్తే సహించం

Rally on 8th in Delhi - Sakshi

ఢిల్లీలో 8న భారీ ర్యాలీ: దళిత సంఘాలు

సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చాలని చూస్తే సహించబోమని దళిత సంఘాలు కేంద్రా న్ని హెచ్చరించాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ చట్టాన్ని పటిష్టపరిచేందుకు కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్య క్షుడు మందకృష్ణ, మాలమహానాడు జాతీయ సమన్వయకర్త అద్దంకి దయాకర్‌ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ...దళితుల హక్కులను కాలరాసే విధంగా సుప్రీంకోర్టు, కేంద్రం వ్యవహరించడం విచారకరమన్నారు.

ఈ ప్రయత్నాలను తాము తిప్పి కొడతామని, ఆగస్టు 8న ఢిల్లీ వేదికగా తమ గళాన్ని కేంద్రానికి వినిపిస్తామన్నారు. రాంలీలా మైదానం లో దేశవ్యాప్తంగా ఉన్న 71 దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ర్యాలీకి తెలుగు రాష్ట్రాల నుంచి దళితులు తరలిరావాలని కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top