ఆయుధాలు డిపాజిట్‌ చేయండి | Rajiv Trivedi said deposit yor Licensed guns in Home ministry | Sakshi
Sakshi News home page

ఆయుధాలు డిపాజిట్‌ చేయండి

Mar 3 2017 2:44 AM | Updated on Sep 5 2017 5:01 AM

ఈనెల 9వ తేదీన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్‌డ్‌ తుపాకులను డిపాజిట్‌ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేదీ

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో హోంశాఖ ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 9వ తేదీన టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్‌డ్‌ తుపాకులను డిపాజిట్‌ చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్‌ త్రివేదీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని లైసెన్స్‌ ఉన్న ఆయుధాలు కలెక్టర్, ఎస్పీ కార్యాలయం .

లేదంటే సంబంధిత పోలీస్‌స్టేషన్, ఆయుధ డీలర్ల వద్ద డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డులు సైతం తుపాకులు సరెండర్‌ చేయాలని ఉత్తర్వుల్లో రాజీవ్‌త్రివేదీ స్పష్టంచేశారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు వెంట ఉండకూడదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement