
నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడతామని చెప్పిన మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంకులో అకౌంట్ ఉంటేనే వస్తుందని వదంతులు రావడంతో మహిళలు పోస్టాఫీసుకు బారులు తీరారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసులో రూ.200లు పెట్టి కొత్త అకౌంట్ ఇవ్వాలని కౌంటర్ వద్ద తోపులాడుకుంటూ ఇలా అకౌంట్లు తీస్తున్నారు. దీనిపై పోస్టాఫీసు అధికారులను సంప్రదించగా.. బయట ఎవరో వదంతి సృష్టించడంతో ఇంతమంది వస్తున్నారని చెప్పారు.