సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాలయంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ అండ్ సికిం ద్రాబాద్ డిస్ట్రిక్ట్ డీఓసీ స్కౌట్
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ కార్యాల యంలో చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ అండ్ సికిం ద్రాబాద్ డిస్ట్రిక్ట్ డీఓసీ స్కౌట్‌గా పని చేస్తున్న జన్ను సుధాకర్‌ను కాజీపే ట రైల్వే అధికారులు, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు.
రైల్వేలో 39 ఏళ్లుగా పనిచేస్తున్న వరంగల్ పొచమ్మమైదాన్‌కు చెందిన సుధాకర్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో 10 ఏళ్ల నుంచి సేవలందిస్తున్నారు. ఈనెల 30న ఉద్యోగ విరమణ పొందనున్న నేపథ్యంలో కాజీపేటలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ డెన్ కార్యాలయంలో ఆయన ను సన్మానించారు.
కార్యక్రమంలో సికింద్రాబాద్ గైడ్స్ డీఓ సీ సంగీత, రైల్వే స్కూల్ హెడ్‌మాస్టర్ భాష, మాజీ స్కౌట్ డీఓసీ ఎన్‌వీ.రావు, మాజీ ఏడీసీ రోవర్స్ ప్రకాష్ పాల్గొన్నా రు. ట్రెస్ మేనేజ్‌మెంట్ సెమినార్‌లో వరంగల్ నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ హరికృష్ణ తన సందేశాన్నిచ్చారు.