వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ | queue for adaptation os street dogs | Sakshi
Sakshi News home page

వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ

Jun 7 2015 8:39 PM | Updated on Sep 3 2017 3:23 AM

వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ

వీధి కుక్కుల దత్తతకు జంతు ప్రేమికుల క్యూ

వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు జంతు ప్రేమికులు క్యూ కట్టారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): వీధి కుక్కలను దత్తత తీసుకునేందుకు జంతు ప్రేమికులు క్యూ కట్టారు. ఆదివారం నెక్లెస్ రోడ్డులోని లేక్‌వ్యూ పార్క్‌లో హైదరాబాద్ పెట్ అడాప్షన్ అనే స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో చేపట్టిన వీధి కుక్కల దత్తత కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. నగరంలో తొమ్మిదో విడత నిర్వహించిన ఈ దత్తత కార్యక్రమంలో 15 కుక్క పిల్లలను నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన వారికి అందజేసినట్లు సంస్థ సభ్యులు చిత్ర, శ్రావణి, ఆనంత్‌రాబర్ట్‌లు తెలిపారు.

అయితే, దత్తత ఇచ్చిన తర్వాత తమ పని అయిపోయిందని చేతులు దులుపుకోబోమని... నెలకోసారైనా వాటి సంరక్షణ ఎలా ఉందో తెలుసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకూ వేయి కుక్కలను చేరదీసి దత్తత ఇచ్చినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement