ప్రేమించాలంటూ...యువతిపై కిరోసిన్ పోశాడు | psycho arrested in siddipet | Sakshi
Sakshi News home page

ప్రేమించాలంటూ...యువతిపై కిరోసిన్ పోశాడు

Jan 11 2015 1:27 PM | Updated on Aug 20 2018 4:44 PM

ప్రేమించాలంటూ...యువతిపై కిరోసిన్ పోశాడు - Sakshi

ప్రేమించాలంటూ...యువతిపై కిరోసిన్ పోశాడు

తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పుంటించేందు ప్రయత్నించగా... అక్కడే ఉన్న స్థానికులు ఆ ప్రేమోన్మాది ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

మెదక్: తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పుంటించేందు ప్రయత్నించగా... అక్కడే ఉన్న స్థానికులు ఆ ప్రేమోన్మాది ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.

ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక కళాశాలలో చదువుతున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాంటూ ఓ యువకుడు రోజూ వెంట పడి వేధిస్తున్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దాంతో ఆమెపై ఆగ్రహంతో ఉన్న సదరు యువకుడు ఉన్మాదిగా మారి ఆదివారం యువతిపై కిరోసిన్ పోశాడు. 

Advertisement
 
Advertisement
Advertisement