విమానంలో మహిళకు పురిటినొప్పులు  | Pregnant Get Pain In Cebu Pacific Air Plane Landed Shamshabad Airport | Sakshi
Sakshi News home page

విమానంలో మహిళకు పురిటినొప్పులు 

Sep 29 2019 3:28 AM | Updated on Sep 29 2019 3:28 AM

Pregnant Get Pain In Cebu Pacific Air Plane Landed Shamshabad Airport - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

శంషాబాద్‌: విమాన ప్రయాణంలో ఓ గర్భిణికి పురిటినొప్పులు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన ఘటన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. సిబు ఫసి పిక్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం శనివారం ఉదయం దుబాయి నుంచి మనీలా బయలుదేరింది. మార్గమధ్యలో మనీలా దేశానికి చెందిన మన నాయేటా బేబిజీన్‌ లెడెస్మా (26) అనే ప్రయా ణికురాలికి పురిటినొప్పులు వచ్చాయి.  దీంతో పైలట్‌ శంషాబాద్‌ ఏటీసీని సంప్రదించి విమానాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దింపారు. సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్టులోని అపోలో ఆస్పత్రి వైద్యసిబ్బంది  మహిళను అంబులెన్స్‌లోకి ఎక్కించారు. నొప్పులు తీవ్రమవడంతో వైద్యులు ఆమెకు అక్కడే ప్రసవం చేశారు. మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement