గర్భిణి ఆత్మహత్యాయత్నం | pragnant women commits suicide in khammam distirict | Sakshi
Sakshi News home page

గర్భిణి ఆత్మహత్యాయత్నం

Apr 24 2015 12:45 PM | Updated on Sep 3 2017 12:49 AM

భర్తతో మనస్పర్థల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

బూర్గంపాడు: భర్తతో మనస్పర్థల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోంపాక అనూష ఏడు నెలల గర్భిణి. లక్ష్మీపురంలోని పుట్టింటికి ఆమె భర్తతో కలసి వచ్చింది. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తాను చనిపోతానని బెదిరించిన అనూష... తెల్లవారుజామున ఇంటి ముందు వంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను భద్రచాలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement