చేపపిల్లల్ని వదిలిన మంత్రి | Post-stocking Agriculture Minister | Sakshi
Sakshi News home page

చేపపిల్లల్ని వదిలిన మంత్రి

Feb 1 2015 12:53 PM | Updated on Sep 2 2017 8:38 PM

నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు.

నాగిరెడ్డిపేట: నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టులో ఆదివారం నాడు  వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి చేపపిల్లల్ని వదిలారు. ఈ ప్రాజెక్టులో 2.2 లక్షల చేపపిల్లల్ని వదలడం ద్వారా మత్స్య సంపదను పెంపొందించినట్లు అవుతుందన్నారు. చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్య కారులను, రైతులను ఆదుకుంటామని మంత్రి పోచారం అన్నారు.

వ్యవసాయ అనుబంధ రంగాలను త్వరితగతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement