రమేశ్‌బాబును జర్మనీకే పరిమితం చేయండి.. | Ponnam Prabhakar takes on CH.Ramesh babu | Sakshi
Sakshi News home page

రమేశ్‌బాబును జర్మనీకే పరిమితం చేయండి..

Apr 15 2014 8:57 AM | Updated on Sep 2 2017 6:04 AM

ప్రసంగిస్తున్న పొన్నం ప్రభాకర్

ప్రసంగిస్తున్న పొన్నం ప్రభాకర్

‘జర్మనీలో సంసారం చేసుకుంటున్న రమేశ్‌బాబును గెలిపించి ఆయనను భార్యాపిల్లల వద్ద ఉండకుండా చేస్తున్నారు..

‘జర్మనీలో సంసారం చేసుకుంటున్న రమేశ్‌బాబును గెలిపించి ఆయనను భార్యాపిల్లల వద్ద ఉండకుండా చేస్తున్నారు.. ఈసారి అలా చేయకుండా జర్మనీకే వెళ్లేలా చేయండి..’ అంటూ ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రజలనుద్దేశించి అన్నారు. సోమవారం రాత్రి ఆయన ఇక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడారు. తెలంగాణ పేరుతో వచ్చిన రమేశ్‌బాబుకు ఈ ప్రాంత ప్రజలు గుండెలకు హత్తుకుని ఓటేశారని, అయినా  ఆయన ప్రజలకు సేవ చేయకుండా జర్మనీలో ప్రొఫెసర్ ఉద్యోగం చేసుకుంటూ భార్యాపిల్లలతో విలాసవంతమైన జీవనం గడిపారన్నారు.

 

ఇప్పుడు మళ్లీ మభ్యపెడుతూ ఓటడుగుతున్నారని, ఈసారి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆది శ్రీనివాస్ పోటీ నుంచి తప్పుకుని బొమ్మ వెంకన్నకు మద్దతు ఇస్తే ఆదికి కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్ కల్పిస్తామన్నారు. ఏఎంసీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, కాంగ్రెస్  పట్టణ  అధ్యక్షుడు కట్కూరి శ్రీనివాస్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, సెస్ మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement