'టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభం' | Ponguleti Sudhakar Reddy takes on Telangana CM KCR | Sakshi
Sakshi News home page

'టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభం'

Sep 28 2014 1:35 PM | Updated on Mar 18 2019 7:55 PM

'టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభం' - Sakshi

'టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభం'

టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభంగా కనిపిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సంక్షోభంగా కనిపిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పవర్ వెనక కుట్ర దాగుందని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్లో పొంగులేటి సుధాకర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... భూ కేటాయింపుల పేరిట ప్రభుత్వ భూములు దుర్వినియోగమైనాయిని ఈ నేపథ్యంలో సినీ రంగానికి భూ కేటాయింపులపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

విద్యా సంవత్సరం మధ్యలో దాదాపు 2 వేల పాఠశాలను మూసివేయడం సరికాదన్నారు. అధికారులు బతుకమ్మ ఏర్పాట్లలో నిమగ్నమవడంతో రాష్ట్రంలో పాలన పడకేసిందని అన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం బతుకమ్మ పండగ అంటూ తెగ హడావుడి చేస్తోందని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement