వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రులను, ప్రజాప్రతినిధులను మోహరించి టీఆర్ఎస్ ఓటర్లను ప్రలోభ పెట్టిందని.. అయినా కాంగ్రెస్ గెలుస్తుందన్న నమ్మకం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతే ఈ ఎన్నికలో ప్రభావం చూపించిందన్నారు. వరంగల్ ఉప ఎన్నిక తమ పాలనపై రెఫరెండం అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఇరిగేషన్ చెల్లింపులు జరపాలన్న ప్రభుత్వ ఆలోచన సరి కాదని, ఆర్థికశాఖ రెక్కలు విరిచే ప్రయత్నం చేస్తున్నారని.. బీసీ వర్గానికి చెందిన ఈటల ఆర్థికశాఖను నిర్వీర్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కాంట్రాక్టర్లతోనే ప్రభుత్వాన్ని నడపాలని టీఆర్ఎస్ భావిస్తోందా అంటూ పొంగులేటి ప్రశ్నించారు.