ఇక అంతే అంటవా..!

Political Satirical Story On Municipal Election Campaign  - Sakshi

సాక్షి, సిరిసిల్ల : ఇది మున్సిపల్‌ ఎన్నికల సమయం. గల్లీ ముచ్చట్లు.. ఇంటి మీదకు తెచ్చే ప్రమాదం ఉంటుంది. ఏం మాట్లాడినా.. ఎవరితో తిరిగినా.. అనుమానాలు, అపోహలకు తావిచ్చే పరిస్థితి. సొంత పార్టీ వారే శంకించేందుకు అవకాశమున్న రోజులు. సిరిసిల్ల పట్టణంలోని ఓ వార్డు నాయకుడు అధికార పార్టీలో ఈ మధ్యనే చేరాడు. ఆ పార్టీ టికెట్‌ వచ్చిన అభ్యర్థికంటే.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి అంటేనే అభిమానం. అతనంటేనే మక్కువ. కానీ పార్టీ క్యాండేటును కాదని దగ్గరి మనిషికి ప్రచారం చేసే పరిస్థితి లేదు.

దీంతో లోలోపల నీకు మద్దతు కానీ.. వాడకట్టులో నీ కోసం మాత్రం తిరగ అంటూ హామీ ఇచ్చేశాడు. ఆ నేతలిద్దరూ ఒకప్పుడు మంచి దోస్తులు.. కానీ ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు కల్వకుంట చేసినయి.. అధికార పార్టీలో ఉన్న కొందరు ఆ పార్టీ అభ్యర్థికి మనస్ఫూర్తిగా ప్రచారం చేయడం లేదు. దగ్గరి మనిషిని ఇడిసిపెట్టి తిరగబుద్ది అయితలేదు. ఎంతైనా ఇది ఎన్నికల సమయం కదా.. ఆ ఎలక్షన్లు అయిపోతే.. ఎవరి సంగతి ఎంటో తెలుస్తుంది.. అన్నా. మరి ఎన్నికలప్పుడు ఏం మాట్లాడినా.. పట్టుకుని మనసుల పెట్టుకుంటరు.. గందుకే ఏం మాట్లాడకపోవడమే ఉత్తమమని సదరు నాయకులు చెప్పడం.. అంతేనంటవా అని మిగతావాళ్లు అనడంతో ఛాయ్‌ పే చర్చ ముగిసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top