వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు | police rides on Prostitution centers | Sakshi
Sakshi News home page

వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు

Jun 9 2015 10:04 PM | Updated on Sep 17 2018 6:26 PM

ఓ వ్యభిచార కేంద్రంపై మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): ఓ వ్యభిచార కేంద్రంపై మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ నిర్వాహకురాలితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే జూనియర్ ఆర్టిస్ట్ అయిన నాలావత్ సుజాత(25) వెంకటగిరిలో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తోందన్న సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి కడపకు చెందిన యువతి, ఫలక్‌నుమాకు చెందిన మరో యువతితోపాటు గుడివాడకు చెందిన ముత్తిలి అనే విటుడ్ని అరెస్టు చేశారు. పట్టుబడిన యువతులు ఇద్దరినీ పునరావాస కేంద్రానికి తరలించగా నిర్వాహకురాలిని, విటుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement