ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ | police register case against karimnagar CI, warangala district woman SI | Sakshi
Sakshi News home page

ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ

Nov 15 2014 11:12 AM | Updated on Aug 21 2018 8:23 PM

ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ - Sakshi

ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ

గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన మరవక ముందే... పోలీస్ శాఖలోనే ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన మరవక ముందే... పోలీస్ శాఖలోనే ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అబిడ్స్లోని  హోటల్లో ఒకే గదిలో ఉన్న సీఐ, మహిళా ఎస్ఐని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీ బందోబస్తు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు లకడీకా ఫూల్ లోని ద్వారక హోటల్లో రూమ్ కేటాయించారు.

 

అయితే సీఐ ద్వారకా హోటల్లో కాకుండా బృందావనం హోటల్లో దిగారు. అదే హోటల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ ఉన్నారు. వీరిద్దరూకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళా ఎస్ఐ భర్త నగరానికి వచ్చాడు. సీఐ...తన భార్య ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు.

కాగా సీఐ స్వామి, మహిళా ఎస్ఐ ఒకే గదిలో ఉన్న సమయంలో ...మహిళా ఎస్ఐ భర్త సునీల్...గత రాత్రి 11 గంటల సమయంలో అబిడ్స్ పోలీసులకు పట్టించాడు.  వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అబిడ్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కేసు నమోదు చేశారు. సీఐ, ఎస్ఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement