మహిళ తలలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్ | police firing training costs bullet in women's head | Sakshi
Sakshi News home page

మహిళ తలలోకి దూసుకెళ్లిన పోలీస్ బుల్లెట్

Aug 22 2014 3:37 AM | Updated on Oct 2 2018 2:33 PM

మెదక్: పోలీస్ ఫైరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో బలగాలు పేల్చిన తుపాకీ నుంచి ఓ బుల్లెట్ గురితప్పింది. దీంతో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలంలో ఉన్న ఓ మహిళ తలలోకి దూసుకుపోయింది.

మెదక్: పోలీస్ ఫైరింగ్ ట్రైనింగ్ సెంటర్‌లో బలగాలు పేల్చిన తుపాకీ నుంచి ఓ బుల్లెట్ గురితప్పింది. దీంతో రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలంలో ఉన్న ఓ మహిళ తలలోకి దూసుకుపోయింది. మెదక్ జిల్లా పుల్‌కల్ మండలం న్యూ హున్నాపూర్ వద్ద గురువారం సీఐఎస్‌ఎఫ్ బలగాలు ఫైరింగ్ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో ఒకరి బుల్లెట్ మిస్‌ఫైర్ అయింది. సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెళ్లి చంద్రకళ తలలోకి దూసుకెళ్లింది.

ఆందోళన చెందిన భర్త ఆగంరెడ్డి ఆమెను సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు బుల్లెట్‌ను తీసి కుట్లు వేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ైెహ దరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. కాగా, సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఫైర్ అయిన బుల్లెట్ గాలిలో వెళ్లి పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు ఆమె తలపై పడి ఉంటుందని అందుకే ప్రాణాపాయం జరగలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement