జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు | Police Case Filed on Jabardasth Comedian Avinash | Sakshi
Sakshi News home page

జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు

Mar 2 2017 4:13 AM | Updated on Aug 21 2018 6:21 PM

జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు - Sakshi

జబర్దస్త్ హాస్యనటుడి పై కేసు

వినోద కార్యక్రమం చేస్తానని అడ్వాన్స్‌ తీసుకొని కార్యక్రమానికి హాజరుకాకుండా మోసం చేసిన కమెడియన్‌ మాస్‌ అవినాష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

బంజారాహిల్స్‌: వినోద కార్యక్రమం చేస్తానని అడ్వాన్స్‌ తీసుకొని కార్యక్రమానికి హాజరుకాకుండా మోసం చేసిన కమెడియన్‌ మాస్‌ అవినాష్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..కర్నూలు జిల్లాకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి కేటీ క్రియేషన్స్‌ పేరుతో ఈవెంట్స్‌ నిర్వహిస్తుంటాడు.

 మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 24న కార్యక్రమం నిర్వహించేందుకు బుల్లితెర కమెడియన్‌ మాస్‌ అవినాష్‌తో ఒప్పందం కుదర్చుకొని ఈనెల 14న రూ.10 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. అయితే ఒప్పందం ప్రకారం అతను కార్యక్రమానికి హాజరుకాకపోగా సెల్‌ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ చేసుకున్నాడు. ఈ కారణంగా అతిథులు నిరాశకు లోనయ్యారని, తమ ఈవెంట్‌ కంపెనీకి చెడ్డపేరు వచ్చిందని బాధితుడు తెలిపాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement