రంగారెడ్డి జిల్లాలో మాంసం వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఓ పౌల్ట్రీఫారంపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.
కల్తీ నూనె తయారీ కేంద్రంపై దాడి
Jan 13 2016 1:07 PM | Updated on Aug 21 2018 5:52 PM
మొమిన్‌పేట: రంగారెడ్డి జిల్లాలో మాంసం వ్యర్థాలతో నూనె తయారు చేస్తున్న ఓ పౌల్ట్రీఫారంపై బుధవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొమిన్‌పేట శివారులోని బారి పౌల్ట్రీఫారంలో అక్రమంగా కల్తీ నూనెను తయారు చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతో దాడి చేసిన పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యజమాని బారి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


