రోడ్డున పడ్డ భద్రత!

Police and RTA officers neglecting the overload and Road safety - Sakshi

ఓవర్‌లోడ్‌ పట్టని పోలీసులు, ఆర్టీఏ అధికారులు

ప్రమాద తీవ్రతను పెంచుతున్న వేగం, ఓవర్‌లోడింగ్‌ 

నేతి బీర చందంగా రహదారి భద్రత

కొండగట్టు, కొత్తపల్లి ప్రమాదాలతో మేల్కోని అధికారులు

ఓవర్‌ స్పీడ్‌కు కళ్లెం ఏది?
- రాష్ట్రంలోని ముంబై,విజయవాడ(65), బెంగళూర్‌ (44), భూపాలపట్నం (163) జాతీయ రహదారులపై వాహనాలు మితి మీరిన వేగంతో దూసుకెళుతున్నాయి. కార్లు గంటకు 90–120 కి.మీ., ప్రైవేటు లారీలు, బస్సులు 120 కి.మీ. నుంచి 150 కి.మీ. వేగంతో వెళుతున్నాయి. ఈ రహదారులపై స్పీడ్‌కు ఎలాంటి కళ్లెం లేదు. స్పీడ్‌గన్లు లేవు. 
ఆయా రహదారులపై గూడ్స్‌ వాహ నాలు పలువురు ప్రయాణికులను ఎక్కించుకుని వెళుతున్నాయి. వీటిని పోలీసులు, ఆర్టీఏ అధికారులు అడ్డుకోవడంలేదు. తూతూ మంత్రంగా జరిమానాలు విధించి చేతులు దులుపుకుంటున్నారు. 

కొత్త చట్టం అమల్లోకి వస్తేనే!
మామూలు జరిమానాలను ఎవరూ పెద్దగా ఖాతరుచేయడంలేదు. ఓవర్‌స్పీడ్‌ విభాగం లోనే గత ఆరునెలల్లో ఏకంగా రూ.46 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఓవర్‌లోడిం గ్‌కు రూ.2కోట్లకు పైగా జరిమానా విధించారు. అయినా ఇలాంటి డ్రైవర్లలో మార్పు రావడం లేదు. ఇంతకాలం ఓవర్‌స్పీడ్‌కు కేవలం రూ.400 మాత్రమే జరిమానా విధించేవారు. కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వస్తే రూ.1000తోపాటు వాహనంలో ఎంతమంది ఉంటే అన్ని రూ.2000 చెల్లించాలి. అప్పుడుగానీ కాస్త మార్పు రావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అనుమతులు లేని వాహనాల్లో ప్రయాణం ప్రమాదకరం. వాటిలోనే కూలీలు ప్రయాణిస్తున్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి కూలీలు మరణించినా వారి కుటుంబాలకు పరిహారం దక్కదు. అలాంటి వాహనాలు ఎక్కడమే చట్టవిరుద్ధమైనపుడు వాటి వల్ల ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలకు కోర్టులు న్యాయం చేయవు. 
– ఆటో అండ్‌ మోటార్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి దయానంద్‌  

ఇటీవల మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్చిల్‌ మండలం కొత్తపల్లి వద్ద ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో 13 మంది చనిపోయారు. 
గతేడాది జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద 100 మందికిపైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కందకంలో పడి 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 
ఓవర్‌లోడ్‌ వాహనాలపై పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం వల్లే ఈ రెండు ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగిందని రోడ్డు భద్రతా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రోడ్డుభద్రత ‘నేతి బీరలో నెయ్యి చందం’
అయింది. భద్రతకు భరోసా లేకుండా పోయింది. ఓవర్‌లోడ్, ఓవర్‌స్పీడ్‌ వాహనాలకు కళ్లెం వేసేనాథుడు లేడు. ఆర్‌అండ్‌ బీ, ఆర్టీఏ శాఖలు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తు న్నాయి. ఫలితంగా రహదారులు రక్తధారలుగా మారుతున్నాయి. పెద్దసంఖ్యలో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.  
 – సాక్షి, హైదరాబాద్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top