అసెంబ్లీ రద్దు.. హైకోర్టులో పిటిషన్‌

PIL filed on Telangana Assembly Dissolve - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ రద్దుపై శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వం 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై రాపోలు భాస్కర్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. 

ఇప్పుడు మళ్లీ ఎన్నికల వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని తెలిపారు. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top