15, 16 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు  | PG Medical And Dental Courses Management Quota Notification | Sakshi
Sakshi News home page

15, 16 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు

Jun 14 2020 3:16 AM | Updated on Jun 14 2020 3:17 AM

PG Medical And Dental Courses Management Quota Notification - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేట్‌ పీజీ వైద్య, దంత కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 15, 16 తేదీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్‌ మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. 15వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 16న సాయంత్రం 7 గంటల వరకు ప్రాధాన్యతా క్రమంలో కాలేజీల వారీగా వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది. తుది మెరిట్‌ జాబితాను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపింది. అట్టి మెరిట్‌ జాబితాలోని అభ్యర్థులు వెబ్‌ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలని పేర్కొంది. ఆర్మీ డెంటల్‌ కాలేజీ సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఇతర వివరాలకు  knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించింది.  

Advertisement
 
Advertisement
Advertisement