ఆగిన దూకుడు... | Petrol Diesel Prices Down | Sakshi
Sakshi News home page

ఆగిన దూకుడు...

Jan 5 2019 10:09 AM | Updated on Mar 11 2019 11:12 AM

Petrol Diesel Prices Down - Sakshi

నాలుగైదు నెలలపాటు ప్రజలను బెంబేలేత్తించిన ఇంధన ఉత్పత్తుల ధరలు ఇప్పుడిప్పుడే దిగివస్తున్నాయి. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు గత అక్టోబర్‌తో పోలిస్తే జనవరిలో భారీగా తగ్గాయి. గ్యాస్‌ ధర దాదాపు రూ.250 వరకు తగ్గగా..పెట్రోలు, డీజిల్‌ ధరలు సైతం రూ.16 వరకు దిగివచ్చాయి.  

సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన వనరుల ధరలు తగ్గుతుండటంతో సామాన్య మధ్య తరగతి కుటుంబాలకు కాస్త ఊరట లభిస్తోంది. తాజాగా వంట గ్యాస్‌(ఎల్‌పీజీ), పెట్రోల్, డీజిల్‌ ధరలు దిగివస్తున్నాయి. గత ఏదాడి కాలంగా దూకుడు పెంచిన ధరలు తిరుగుముఖం పట్టాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తుండంతో  చమురు ధరల దూకుడును తగ్గించింది. మొన్నటి వరకు వంట గ్యాస్‌« ధరకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఏకంగా సిలిండర్‌ ధర వెయ్యి వరకు ఎగబాకగా, పెట్రోల్‌«, డీజీల్‌ ధర నువ్వా , నేనా అనే విధంగా లీటర్‌ రూ.90 దగ్గరకు చేరింది.  పెరిగిన ధరలు తిరిగి పాత స్థాయికి చేరుకుంటున్నాయి. ఈమేరకు గ్యాస్‌ సిలిండర్‌ ధర నగరంలో రూ.744.55 కు చేరింది. గృహ వినియోగదారులు వంటగ్యాస్‌ సిలిండర్‌ను నగదు బదిలీ పథకం కింద మార్కెట్‌ విలువ ప్రకారం పూర్తి నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉన్న కారణంగా భారంగా మారింది. తాజాగా ధర దగివస్తుండటంతో కొంత వెసులుబాటు కలుగుతోంది.మహా నగరంలోని హైదరాబాద్‌–రంగారెడ్డి–మేడ్చల్‌ జిల్లాలో కలిపి మూడు చమురు సంస్ధలకు చెందిన డొమెస్టిక్‌ కనెక్షన్లు 26.21 లక్షల వరకు ఉన్నాయి. నగరంలో మొత్తం 135 ఎల్పీజీ ఏజెన్సీలుండగా ప్రతిరోజు 1.20 లక్షల వరకు డొమెస్టిక్‌ సిలిండర్ల డిమాండ్‌ ఉంటుంది. 

రోజువారి తగ్గుముఖం
పెట్రోల్, డీజిల్‌ ధరల దూకుడుకు కళ్లెం పడింది. రోజువారి ధరల సవరణతో దూకుడు పెంచి హడలెత్తినంచిన పెట్రోల్, డీజిల్‌ ధరలు వెనక్కి తగ్గుతున్నాయి. గత  నాలుగు మాసాల్లో పెట్రోల్‌పై రూ.16.46 పైసలు, డీజిల్‌పై రూ.14.45 పైసలు తగ్గింది. పెట్రోల్‌ లీటర్‌ ధర రూ.89.06 వరకు ఎగబాకి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. అదేబాటలో డీజిల్‌ ధర కూడా ఎగబాకి దేశంలోనే రికార్డు సృష్టించింది. అప్పట్లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.82.33 పైసలు పలికింది. తాజాగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలోనే పెట్రోల్‌ వినియోగంలో సగం భాగం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ఉంటుంది. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో  మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్‌ బంకులు ఉండగా..వాటి ద్వారా ప్రతిరోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్ముడు పోతుంది. ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి ప్రతిరోజు పెట్రోల్‌ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కొక్క ట్యాంకర్‌ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది .

గ్రేటర్‌ హైదరాబాద్‌లో ధరలు ఇలా..
ఇంధనం            జనవరి       డిసెంబర్‌      నవంబర్‌       అక్టోబర్‌
–––––––––––––––––––––––––––––––––––––––––(రూ.లలో)
వంట గ్యాస్‌(14.2 కేజీలు)    744.55    867.00    999.00    936.50
పెట్రోల్‌(లీటర్‌)        72.60    76.89    84.14      89.06
డీజిల్‌  (లీడర్‌)        67.88    73.17    80.25     82.33

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement