డీజీపీల నియామకంపై క్యాట్‌లో పిటిషన్ | petition in cat for dgp appointments | Sakshi
Sakshi News home page

డీజీపీల నియామకంపై క్యాట్‌లో పిటిషన్

Jun 14 2014 1:01 AM | Updated on Sep 2 2017 8:45 AM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్‌చార్జి డీజీపీలుగా జేవీ రాముడు, అనురాగ్‌శర్మల నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎస్‌ఏ హుడా, టీపీ దాస్ (1979 బ్యాచ్) శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్లు దాఖలు చేశారు.

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇన్‌చార్జి డీజీపీలుగా జేవీ రాముడు, అనురాగ్‌శర్మల నియామకాన్ని సవాల్ చేస్తూ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎస్‌ఏ హుడా, టీపీ దాస్ (1979 బ్యాచ్) శుక్రవారం కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో పిటిషన్లు దాఖలు చేశారు. తమకంటే జూనియర్లను ఇన్‌చార్జి డీజీపీలుగా నియమించడం చెల్లదని ఫిర్యాదు చేశారు. గత నెల 30వ తేదీనే క్యాడర్ కేటాయింపులు జరిగాయని, ఇవన్నీ నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. 1982 బ్యాచ్ తరువాత అధికారులను తెలంగాణకు కేటాయించారని, దీంతో వారికంటే సీనియర్లైన అధికారులకు అన్యాయం జరిగినట్లయిందని నివేదించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement