కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగ గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది. గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం తేలుతుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు గ్రామానికి చెందిన శనిగారపు రాజిరెడ్డి(55)దిగా గుర్తించారు. కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకొని దసరా రోజు ఇంటి నుంచి వెళ్లి పోయినట్లు స్థానికులు చెబుతున్నారు.