వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని అతని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సన్ షైన్ ఆస్పత్రిలో ఆది వారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తి అనారోగ్యంతో సన్ షైన్ ఆస్పత్రిలో చేరాడు. కాగా... అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. సరైన చికిత్స అందక పోవడం వల్లే రోగి మృతి చెందాడని అతని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు.