భయం భయంగా ఆసుపత్రులకు

Patients Are Scared With Coronavirus In Hospitals In Hyderabad - Sakshi

కరోనా సడలింపులిచ్చినా ఊపందుకోని ఓపీ

రోగులు, వైద్య సిబ్బందిలోనూ టెన్షన్‌

చాలా జిల్లాల్లో 50 శాతానికి మించని వైద్య సేవలు

అత్యవసరమైతే తప్ప సాధారణ వైద్యానికి రాని రోగులు

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సడలింపులు ఇ చ్చాక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. అన్ని రకాల కరో నా నియంత్రణ జాగ్రత్తలు తీసుకున్నారు. అ యినా ఆసుపత్రులకు రావడానికి రోగులు జం కుతున్నారు. తీవ్ర ఆరోగ్య సమస్యలుంటేనే వ స్తున్నారు. గతం మాదిరిగా ప్రతి చిన్న సమస్య కు ఆసుపత్రికి రావడానికి సుముఖత చూపట్లే దు. ఇంకా ప్రజలను కరోనా భయం వెంటాడుతోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆసుపత్రులంటేనే రోగులు ఆం దోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తం గా ఆసుపత్రులకు 50 శాతానికి మించి ఓపీ రావట్లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కొన్నిచోట్ల 30 నుం చి 40 శాతం వరకు మాత్ర మే ఓపీ ఉంటుందని చెబుతున్నారు.

వైద్య సేవలపై సర్కారు దృష్టి..
రాష్ట్రంలో జిల్లా కేంద్ర ఆసుపత్రులున్నాయి. 22 ఏరియా ఆసుపత్రులున్నాయి. 885 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. 4,797 సబ్‌ సెం టర్లు, 41 సామాజిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. ఇవికాకుండా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో బోధనాసుపత్రులు, వాటి పరిధిలో స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు సాధారణ రోజుల్లో నిత్యం 1.23 లక్షల వరకు ఓపీ వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులకు దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఓపీ ఉంటుందని ప్రజారోగ్య అధికారులు అం చనా వేశారు. లాక్‌డౌన్‌కు ముందు వరకు ఆయా ఆసుపత్రులకు రోగులు ఎలాంటి ఇబ్బం ది లేకుండా వచ్చేవారు. లాక్‌డౌన్‌తో అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలినవి నిలిచిపోయాయి.

సాధారణ శస్త్రచికిత్సలన్నీ ని లిచిపోయాయి. సడలింపులివ్వడంతో ఇప్పుడు మళ్లీ అన్ని వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ బోధనాసుపత్రుల్లోని వైద్యులు మూడింట రెండో వంతు మంది విధులకు వచ్చేలా, మిగిలిన వారు 5 రోజులు క్వారంటైన్‌లో ఉండేలా అనుమతి ఉం డేది. దాన్ని బుధవారం నుంచి ఎత్తివేసి అంద రూ విధులకు హాజరుకావాలని సర్కారు స్ప ష్టం చేసింది. ఇతర ఆసుపత్రులు కూడా రోగులకు భరోసా కల్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. దీనిపై ఆ శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పరిస్థితిపై బుధవారం ఆరా తీశారు. సాధారణ వైద్యం సహా వ్యాక్సినేషన్‌పై కూడా దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఆసుపత్రులను ఆదేశించింది.

ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు
ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ కరోనా చికిత్సలు ప్రారంభమయ్యాయి. అందు కు ప్రభుత్వం ఇటీవల ఐసీయూ, వెంటిలేటర్‌ సౌకర్యం ఉన్న అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు కరోనా చికిత్సలు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొం దరు సంపన్నులు అటువైపు వెళ్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నెల 12 వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అనేక ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు 2,601 మంది తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందుల తో రాగా, వారిలో 2,238మందికి నిమ్స్‌లో కరో నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వాటిలో 102 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఈ నెల 6 నుం చి 12 మధ్య 678 మంది తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో రాగా, వారిలో 488 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 9 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. కొన్ని పాజిటివ్‌ కేసులకు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే చికిత్స అందించారు.

  • హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రికి లాక్‌డౌన్‌కు ముందు ఔట్‌పేషెంట్లు (ఓపీ) రోజుకు 2 వేల నుంచి 2,500 మంది వచ్చేవారు. లాక్‌డౌన్‌ సమయంలో ఈ సంఖ్య 500–700 వరకు పడిపోయింది. ఇప్పుడు  సడలింపులు ఇచ్చాక ప్రస్తుతం వెయ్యి నుంచి 1,100 ఓపీ నమోదవుతోంది.
  • లాక్‌డౌన్‌ ముందు సూర్యాపేట జిల్లా ఆస్పత్రిలో రోజూ 500కు పైగా ఓపీ ఉండేది. ఇప్పుడు రోజుకు ఓపీ సరాసరి 250 వరకు ఉంటోంది.
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లాక్‌డౌన్‌కు ముందు జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో రోజు 1,500 ఓపీ ఉండేది. ప్రస్తుతం 800  ఉంటోంది.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top