చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి | Panchayat Secretary killed while receiving treatment | Sakshi
Sakshi News home page

చికిత్సపొందుతూ పంచాయతీకార్యదర్శి మృతి

Sep 14 2019 5:42 AM | Updated on Sep 14 2019 5:42 AM

Panchayat Secretary killed while receiving treatment - Sakshi

నాగర్‌కర్నూల్‌: పని ఒత్తిడి తట్టుకోలేక  ఆత్మహత్యకు యత్నించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి స్రవంతి చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి నిమ్స్‌లో మృతి చెందింది. నాగర్‌కర్నూల్‌ పట్టణానికి చెందిన స్రవంతి గుమ్మకొండలో పంచాయతీకార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నక్రమంలో గురువారం మధ్యాహ్నం  కార్యాలయంలోనే పురుగుమందు తాగిన విషయం తెలిసిందే.   స్రవంతి భర్త  8 నెలల క్రితం నాగర్‌కర్నూల్‌లో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందాడు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement