ముఖ్యమంత్రి గారికి... | Outpouring of complaints to Chief Minister | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి గారికి...

Jan 11 2015 2:40 AM | Updated on Aug 15 2018 9:27 PM

ముఖ్యమంత్రి గారికి... - Sakshi

ముఖ్యమంత్రి గారికి...

నగరంలో మూడో రోజు శనివారం గడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినతులు వెల్లువెత్తారుు.

బారులు తీరిన ఉద్యోగ, {పజా సంఘాల నాయకులు
ముఖ్యమంత్రికి ఫిర్యాదుల వెల్లువ

 
నగరంలో మూడో రోజు శనివారం గడిపిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు వినతులు వెల్లువెత్తారుు. వ్యక్తిగత విన్నపాలతోపాటు, ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, కులవృత్తుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కాలనీ సంఘాలు, ఉద్యోగులు, వృద్ధులు, వితంతువులు ఇలా ప్రతి ఒక్కరూ ఆయనను నేరుగా కలిసి వినతిపత్రం అందించి వారి సమస్యలు వినిపించారు. ముఖ్యమంత్రి వారి సమస్యలను ఓపికగా విన్నారు.
 
హన్మకొండ : హైదరాబాద్ లుంబినీపార్కులో బుద్ద విహార్‌ను నిర్మించాలని, వరంగల్‌లో బుద్ధ విహార్‌కు స్థలం కేటాయించాలని, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్‌లోని బుద్ద విహార్‌లలో వసతులు కల్పించాలని ది బుద్దిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మల కట్టయ్య కోరారు. ఆయనతో విశ్వేశ్వర్‌రావు, కృష్ణస్వామి, ఎల్లయ్య ఉన్నారు.
     
హన్మకొండలో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న గిరిజన భవన్ నిర్మాణానికి నిధులు మంజూ రు చేయాలని తెలంగాణ బంజార సంక్షేమ సంఘం అధ్యక్షుడు సజ్జన్‌నాయక్ కోరారు.
     
18 రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారని, తెలంగాణలో తమను ఎస్టీ జాబి తాలో చేర్చాలని రజక హక్కుల సాధన సమి తి అధ్యక్షుడు డి.కుమారస్వామి కోరారు.
     
పోల్‌టాక్సీని రద్దు చేయాలని తెలంగాణ గ్రామీణ కేబుల్ ఎంఎస్‌ఓ, ఆపరేటర్స్ సంక్షేమ సంఘం ప్రతినిధులు పాల్వంచ కోటేశ్వర్, బైరి శ్రీనివాస్, ఉమాశంకర్, ఇంద్రసేనారెడ్డి కోరగా.. సీఎం సానుకూలంగా స్పందించారు.
     
పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయూస్ యూనియన్, ఎస్సీ, ఎస్టీ వెల్‌ఫేర్ అసోషియేషన్, మైనారిటీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు మహ్మద్ నయూమోద్దీన్, చాట్ల రవికుమార్, అబిద్ ఆలీ, చెన్నమల్ల రమేశ్, టి.వి.శ్రీనివాస్, మహ్మద్ ఇక్బాల్, పి.సంపత్ కోరారు.
     
ముదిరాజ్‌లను బీసీ‘డీ’ నుంచి బీసీ ‘ఏ’లోకి మార్చాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు పల్లెబోయిన అశోక్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ఆయనతో నాయకులు బుస్సా మల్లేశం, బయ్య స్వామి, బోళ్ల బాలరాజు, ఇండ్ల నాగేశ్వర్‌రావు, పులి రజనీకాంత్ ఉన్నారు.
     
తమ సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ఎంపీటీసీ సభ్యులు సీఎం కేసీఆర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీటీసీలు శానబోయిన అశోక్, మహబూబ్‌రెడ్డి, అన్నారపు యాకయ్య పాల్గొన్నారు. అలాగే ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పాతూరి రమేష్, ఉపాధ్యక్షురాలు ముద్దసాని రాధ, ప్రధాన కార్యదర్శి పోరిక గోవింద్‌నాయక్ మరో వినతిపత్రం సమర్పించారు.
   
నాయూబ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించాలని సీఎంను ఆ సంఘం జిల్లా కార్యదర్శి నాగవెళ్లి సురేష్‌కుమార్, నాయకులు భాగ్యలక్ష్మి, జి.ఉపేంద్ర, ఎన్.జగన్, నరేందర్, సారన్న కోరారు.
     
తమకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని అంధుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.రవీందర్, నాయకులు గద్దల రవీందర్ సీఎంను కలవగా ఆయన సానుకూలంగా స్పందించారు.
     
నగరంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న పేదలందరికి పట్టాలు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించాలని సీపీఐ(ఎం) నాయకులు దుబ్బ శ్రీనివాస్, మర్రి శ్రీనివాస్, బోగి సురేష్  యాదగిరి, టి.ఉప్పలయ్య, కారు ఉపేందర్ కోరారు.
     
108 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర 108 ఎంప్లాయూస్ యూనియన్ నాయకులు మహేందర్‌రెడ్డి, ఏఎస్.రావు, సురేష్ కోరారు.
     
ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు జన్ను నర్సయ్య, నాయకులు గుండె కుమార్, మారెపల్లి శేఖర్ కోరారు.
     
ఐకేపీలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసి, పదోన్నతులు కల్పించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు డి.బాలసుందర్, జి.అశోక్ కోరారు.
     
నగరంలోని మురికివాడల ప్రజలకు వ్యక్తిగత గృహాలు నిర్మించాలని, ఎస్‌ఆర్‌ఆర్‌తోటలోని ఆకారపు వీరలక్ష్మి కాలనీ గుడిసెవాసులకు ప్రభుత్వ గృహాలు నిర్మించాలని కోరుతూ నివాస హక్కుల పరిరక్షణ ప్రచార సమితి(చత్రి) సిటీ కో ఆర్డినేటర్ ఎస్.సాహితి, ఫీల్డ్ కోఆర్డినేటర్ ఎస్.అనిల్ వినతిపత్రం సమర్పించారు.
     
అంగన్‌వాడీ వర్కర్ల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సరస్వతి, ప్రతినిధులు సుష్మచంద్ర, భవానీ, సుమాంజలి, మంగళగౌరి, జయ, భాగ్యలక్ష్మి కోరారు.
     
పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పర్యాటక అభివృద్ధి సంస్థ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి కోరారు. నాయకులు సీహెచ్.శ్రీధర్‌రెడ్డి, అశోక్‌రెడ్డి, వెంకట్, చారి, పాషా, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
     
ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో 12 ఏళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని వారు సీఎంను కోరారు. ఆయన సానుకూలంగా స్పందించి జిల్లా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.   పారామెడికల్ ఉద్యోగుల సమస్యలు సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ పారామెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి సురేందర్, నాయకులు ఉపేంద్రచారి, రాములు సీఎంను కోరారు.
   
కమలాపురం(మంగపేట) : బిల్ట్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బిల్ట్ కార్మిక జేఏ సీ నాయకులు సీఎంను కలిశారు. ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని ఎలా సమస్యను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చెప్పినట్లు  జేఏసీ నాయకులు కుర్బాన్‌అలీ తెలిపా రు. జేఏసీ నాయకులు వడ్లూరి రాంచందర్, పుసులూరి గణపతి, డీవీపి రాజు, చొక్కారావు, శర్మ, విజయరావు ఉన్నారు.         
     
రీరుుంబర్స్‌మెంట్ కోసం.. విద్యార్థులు

     
కేయూక్యాంపస్ :  పెండింగ్‌లోఉన్న స్కాలర్‌షిప్‌లను, ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పూర్తిస్థాయిలో చెల్లించాలని, కేయూకు వీసీని, పాలకమండలిని నియమించాలని  పీడీఎస్ యూ, టీఎన్‌ఎస్‌ఎఫ్, ఏబీవీపీ, ఆధ్వర్యంలో వేర్వేరుగా వినతిపత్రాలు సమర్పించారు. పీడీఎస్‌యూ జిల్లా, నగర ప్రధా న కార్శదర్శులు బి. నరసింహారావు, దుర్గం సారయ్య, కేయూ బాధ్యులు చెలమల్ల వీరన్న, సూత్రపు అనిల్, చిరంజీవి, సురేశ్, మహేందర్, టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూక్య సాంబయ్య, రాష్ట్ర కార్యదర్శి జాటోత్ సంతో ష్, నాయకులు సాయిరామ్, మాదాసు శ్రీని వాస్, వంశీ, ఏబీవీపీ నాయకులు మైల నర్సింహులు, వెంకట్, రాకేష్ పాల్గొన్నారు.
     
వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ర్ట వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్‌ను వెంటనే ప్రకటించాలని, వికలాంగులకు చైర్మన్‌గా కేయూ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని ఫిజికల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ బాధ్యులు కోరారు.
     
కేయూకు రెగ్యులర్ వీసీని నియమించి, ఈసీని ఏర్పాటు చేయాలని, టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, అధ్యాపకులకు 65 ఏళ్లకు, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు 60 ఏళ్లవరకు ఉద్యోగ విరమణ వయోపరిమితిని పెంపుదల చేయాలని నాయకులు కోరా రు. అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. సారంగపాణి, జనరల్ సెక్రటరీ డాక్టర్ వి. కృష్ణారెడ్డి, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.కొండల్‌రెడ్డి, కేయూ ఎన్‌జీవో అధ్యక్షుడు  డాక్టర్ కోల శంకర్, క్లాస్‌ఫోర్త్ నేత వెంకట్రాంనర్సయ్య పాల్గొన్నారు.
     
ఎస్‌డీఎల్‌సీఈలో పనిచేస్తున్న టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని టైంస్కేల్  ఉద్యోగుల సంఘం బాధ్యులు కోరారు. వారిలో టైంస్కేల్ ఎంప్లాయూస్ యూనియన్ బాధ్యులు బండ వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి బూర సత్యప్రకాశ్, బాల్నెనాగేశ్వర్‌రావు, దొంతుల ఈశ్వరయ్య, ప్రతాప్, శ్రీరాం వెంకటేశ్వర్లు, రహీం పాల్గొన్నారు.
     
పోచమ్మమైదాన్ : ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ భవన నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని బ్రాంచ్ అధ్యక్ష, కార్యదర్శులు రంగయ్య, త్రిపురనేని గోపీచంద్ సీఎంను కోరారు. సీఎంను కలిసిన వారిలో సీఏలు రాజేంద్రకుమార్, చంచల్ అగర్వాల్, రాజు కరుణాకర్, క్రాంతి, హరికృష్ణ, ఉన్నారు.
     
వరంగల్ అర్బన్ : ఏడాది కాలంగా నగర పాలక సంస్థలో జరిగిన అభివృద్ధి పనులు, అక్రమాలపై విచారణ నిర్వహించి కమిషనర్ సువర్ణపండాదాస్‌పై చర్యలు తీసుకోవాలని ఆక్రమణ ఏరియాల భూముల, చెరువుల పరిరక్షణ సోసైటీ అధ్యక్షుడు పెరుమాండ్ల లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఆయనతో ఉపాధ్యక్షుడు మహబూబ్‌అలీ,వెంకటేశ్వర్లు ఉన్నారు.
     
కాజీపేట : గీత, చేనేత కార్మికులకు అంది స్తున్న విధంగా 50 ఏళ్లకే విశ్వబ్రాహ్మణులకు పింఛన్ వర్తింపచేయాలని గ్రేటర్ వరంగల్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు  శృంగారపు బిక్షపతి, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి, వ్యవస్థాపక గౌరవ అధ్యక్షుడు మారోజు దేవేంద్రచారి, జిల్లా అధ్యక్షుడు భాస్కరాచారి కోరారు. విశ్వబ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు వారు చె ప్పారు.
     
1991 బ్యాచ్ సీఐల నివేదన..


     
వరంగల్ క్రైం : వరంగల్ జోన్‌లో తమకు అన్యాయం జరిగిందంటూ 1991 బ్యాచ్‌కు చెందిన సీఐలు సీఎంను కలిశారు. ఈ జోన్ లో 57 సీఐ పోస్టుల క్వాలిఫికేషన్‌లో తప్పు లు దొర్లాయన్నారు. మిగతా జోన్లలో తమ బ్యాచ్ సీఐలు ఇప్పటికే డీఎస్పీలుగా ప్రమోషన్ పొందారని చెప్పారు. సీఐలు రాయల ప్రభాకర్, జితేందర్, వెంకటేష్‌బాబు, విద్యాసాగర్, సత్యనారాయణ ఉన్నారు.
     
మేడారంపై దృష్టి పెట్టరూ..

     
మేడారం(తాడ్వాయి) : ‘అయ్యా సీఎం గారూ.. మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతర దగ్గరపడుతోంది. అధికారంలోకి వస్తే మేడారం జాతర రూపురేఖలు మారుస్తామని అప్పట్లో మీరు చె ప్పిండ్లు. కానీ మినీజాతర లో కనీస సౌకర్యాలు కల్పనపై గింతైనా ఆలోచించడం లేదుసారూ.. తెలంగాణ స్వరాష్ట్రానికి మీరు సీఎం కావాలని మా అర్యా దైవాలైన సమ్మక్క- సారలమ్మలు దీవించారు కదా సారూ’ అని సమ్మక్క పూజరులు సీఎం చంద్రశేఖరరావును వేడుకుంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement