ఏపీలో ప్రతిపక్ష నేత మైకునే కట్‌ చేస్తున్నారు | Opposition sore over switching off mikes while speaking in Assembly | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రతిపక్ష నేత మైకునే కట్‌ చేస్తున్నారు

Mar 23 2017 2:22 AM | Updated on Sep 5 2017 6:48 AM

ఏపీలో ప్రతిపక్ష నేత  మైకునే కట్‌ చేస్తున్నారు

ఏపీలో ప్రతిపక్ష నేత మైకునే కట్‌ చేస్తున్నారు

పద్దులపై చర్చ సందర్భంగా డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి వ్యవహరించిన తీరు హుందాగా లేదన్న ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి...

ఇక్కడ ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నాం: హరీశ్‌రావు
అయినా హుందాగా వ్యవహరించడం లేదంటే ఎలాగని ప్రశ్న


సాక్షి, హైదరాబాద్‌: పద్దులపై చర్చ సంద ర్భంగా డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డి వ్యవహరించిన తీరు హుందాగా లేదన్న ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి, బీజేఎల్పీ నేత  కిషన్‌రెడ్డిల ఆరోపణలను మంత్రి హరీశ్‌రావు ఖండించారు. ఆ చర్చలో డిప్యూటీ స్పీకర్‌ ప్రతి పక్షానికే ఎక్కువ అవకాశమిచ్చారని స్పష్టం చేశారు. ఎక్కువ సభ్యులున్న అధికార పక్షం 25 నిమిషాలు మాట్లాడితే.. కాంగ్రెస్‌ సభ్యులు గంటా ముప్పై నిమిషాలు, బీజేపీ సభ్యులు 46 నిమిషాలు మాట్లాడారని వివరించారు.

ఇప్పటి వరకు జరిగిన సమావేశాల మొత్తంగా చూసినా.. టీఆర్‌ఎస్‌ సభ్యులు ఆరు గంటల ముప్పైనిమిషాలు మాట్లాడితే, కాంగ్రెస్‌ సభ్యులు ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడారని తెలిపారు. ప్రతిపక్ష నేత లేచిన ప్రతిసారి డిప్యూటీ స్పీకర్‌ మైకు ఇచ్చారని.. దాదాపు ఐదుసార్లు ఆయన చర్చ మధ్యలో మాట్లాడారని చెప్పారు. అయినా ప్రతిపక్షం పట్ల హుందాగా వ్యవహరించడం లేదన్న వ్యాఖ్యలు బాధాకరమని హరీశ్‌ వ్యాఖ్యా నించారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ప్రతిపక్ష నేత మైకును పదే పదే కట్‌ చేస్తున్నారని.. అదే మన శాసనసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్నామని పేర్కొన్నారు.

డిప్యూటీ స్పీకర్‌ తీరు ఆక్షేపణీయం
 మంగళవారం డిప్యూటీ స్పీకర్‌ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయంగా ఉందంటూ ప్రతిపక్ష నేత జానారెడ్డి స్పీకర్‌ దృష్టికి తెచ్చారు. బుధవారం సభ ప్రారంభమైన వెంటనే ఈ విషయాన్ని లేవనెత్తారు. సభ సజావుగా జరిగేందుకు అధి కార పక్షానికి ప్రతిపక్షం పూర్తిగా సహకరి స్తోందని.. ప్రభుత్వం తరఫున ఎవరు మాట్లాడినా సమయమిచ్చిన డిప్యూటీ స్పీకర్‌ ప్రతిపక్షం నుంచి మాట్లాడితే అవకాశం ఇవ్వ లేదని ఆరోపించారు.

దీనిపై ప్రతిసారి లేచి చెప్పడానికి తనకు హుందాగా లేదని, పద్దులపై తమ అభ్యంతరాలు వినకపోవడం విచారకర మన్నారు. ‘‘డిప్యూటీ స్పీకర్‌కు తగిన సూచ నలు, సలహాలు ఇవ్వండి. అవవసరమైతే ప్యానల్‌ స్పీకర్‌ను సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి డిప్యూటీ స్పీకర్‌తో చర్చించండి. సభను ఇలాగే జరుపుతామంటే ఇక్కడ కూర్చో వడంలో అర్థం లేదు..’’అని జానా వ్యాఖ్యానిం చారు. ఇక ప్రజల ఆవేదనను సభలో చెప్పేం దుకు వస్తే డిప్యూటీ స్పీకర్‌ పదేపదే తమ మైక్‌ కట్‌ చేశారని.. విపక్షాలను మాట్లాడ నివ్వడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపిం చారు.

జానారెడ్డి అంటే అపార గౌరవముంది
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న జానారెడ్డి అంటే తమకు అపార గౌరవం ఉందని స్పీకర్‌ మధుసూదనాచారి పేర్కొన్నారు. స్పీకర్‌ స్థానంలో ఎవరు కూర్చున్నా హుందాగానే వ్యవహరిస్తారని.. ఏపీలో కన్నా ఇక్కడ హుం దాగా సభను నడుపుకొంటున్నామని వ్యాఖ్యా నించారు. ఎవరికెంత సమయం ఇవ్వాలన్న దానిపై కొన్ని మినహాయింపులు ఉన్నాయని.. వాటిని పక్కనపెట్టి కూడా డిప్యూటీ స్పీకర్‌ ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement