కరోనాపై పోరుకు ముందుకు రండి

Online Video Clinic Software Launched By The KTR - Sakshi

పలు సంస్థలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

ఆన్‌లైన్‌ వీడియో క్లినిక్‌ సాఫ్ట్‌వేర్‌ ఆవిష్కరణ 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరులో ప్రభుత్వానికి సహకరించేందుకు పలు సంస్థలు ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. హైదరాబాద్‌కు చెందిన నౌ ఫ్లోట్స్‌ కంపె నీ రూపొందించిన సమీకృత ఆన్‌లైన్‌ వీడియో క్లినిక్‌ సాఫ్ట్‌వేర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. దేశంలోని 1.15 మిలియన్ల (11.5 లక్షలు) మంది వైద్యులతో రోగులు తమ ఆరోగ్య సమస్యలు చెప్పుకునేందుకు వీలుగా ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించా రు. వైద్యుల అపాయింట్‌మెంట్, వీడియో ద్వారా ముఖాముఖి, ప్రిస్కిప్షన్‌ మేనేజ్‌మెంట్, రోగుల రికార్డుల నిర్వహణ, బిల్లుల చెల్లింపు వంటివి దీని ద్వారా సులభతరం అవుతాయని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ సాఫ్ట్‌వేర్‌ను కొన్ని జిల్లాల్లో వెంటనే విని యోగిస్తామన్నారు. డాక్టర్ల సాయంతో డిజిటల్‌ సేవ లు పొందే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందన్నారు. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు వంటి వాటిలో ఈ సాఫ్ట్‌వేర్‌ను సులభంగా ఉపయోగించవచ్చని, దేశంలోని 500 మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులకు అనుకూలంగా ఉం టుందని నౌ ఫ్లోట్స్‌ వెల్లడించింది. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, నౌఫ్లోట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ నిఖిల్‌ సల్కర్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top