బాబును బావిలో పారేసిన మహిళలు | one month old thrown into well by two women | Sakshi
Sakshi News home page

బాబును బావిలో పారేసిన మహిళలు

Apr 21 2015 3:19 PM | Updated on Mar 28 2018 11:08 AM

కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న కక్షతో.. నెల రోజుల వయసున్న బాబును ఇద్దరు మహిళలు బావిలో పారేశారు.

కుటుంబాలు, గ్రామాల మధ్య ఉన్న కక్షతో.. నెల రోజుల వయసున్న బాబును ఇద్దరు మహిళలు బావిలో పారేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రంగారెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. పాడుబడిన మంచినీటి బావిలో ఆ బాబును పారేశారు. రెండు గ్రామాల మధ్య గొడవ ఉండటం వల్లే వాళ్లు ఆ బాబును బావిలో పారేసినట్లు తెలిసింది.

అయితే సమయానికి రంగారెడ్డిపల్లి గ్రామస్థులు గమనించి వెంటనే బాబును బావిలోంచి బయటకు తీశారు. అదే సమయంలో మహిళలకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు ఎవరన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు.

Advertisement

పోల్

Advertisement