ముళ్లపొదల్లో ఆడ శిశువు | Newborn Female Infant Found In Thorny Bush | Sakshi
Sakshi News home page

Apr 10 2018 6:49 AM | Updated on Apr 10 2018 6:49 AM

Newborn Female Infant Found In Thorny Bush - Sakshi

నవజాత శిశువు

సాక్షి, శెట్టూరు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఆడశిశువు ముళ్లపొదల పాలైంది. మంగంపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన మహిళలకు ముళ్లపొదల్లో ఆడశిశువు కనిపించింది. వెంటనే ఆ పాపను అక్కున చేర్చుకుని సపర్యలు చేసి అనంతరం ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించారు. అంగన్‌వాడీ కార్యకర్త సుధారాణి, సూపర్‌ వైజర్‌ చంద్రమ్మ, ఏఎన్‌ఎం జయమ్మలు ఆ శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యాధికారి ముషీరాబేగం వైద్య పరీక్షలు నిర్వహించి ఆడ శిశువు ఆరోగ్యంగా ఉందని తెలిపారు. ఎవరైనా దంపతులు తమకు శిశువు కావాలని వస్తే నింబంధనల ప్రకారం అప్పగిస్తామని ఐసీడీఎస్‌ అధికారులు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement