రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి | one killed in road accident in Bhuvanagiri | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

Jun 16 2015 9:09 AM | Updated on Aug 30 2018 3:56 PM

భువనగిరి శివారులోని జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

నల్గొండ: భువనగిరి శివారులోని జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు...భువనగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్రవాహనం నడుపుతున్న మల్లయ్య(32) అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న శీను(30) తీవ్రంగా గాయపడ్డాడు. వీరు భువనగిరికి చెందినవారుగా గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement