వాహనం ఢీకొని ఒకరు మృతి | one dies in road accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని ఒకరు మృతి

Oct 11 2015 3:46 PM | Updated on Aug 30 2018 3:56 PM

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి.

కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ వైపు నుంచి బైక్‌పై ఇద్దరు కర్నూలు వైపు వెళుతుండగా, ఓ గుర్తు తెలియని వాహనం కొత్తకోట బైపాస్ వద్ద ఢీకొంది. బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందగా, మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను 108 వాహనంలో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement