చెట్టును ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి | one dies after car hits tree in Khammam district | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న స్కార్పియో: ఒకరు మృతి

Jun 24 2015 11:35 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది.

ఖమ్మం: వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన జిల్లాలోని చండ్రుగొండ మండలం మద్దుకూరు గ్రామ శివారులోని మూల మలుపు వద్ద బుధవారం ఉదయం జరిగింది. చీరాల నుంచి పాల్వంచ వెళ్తున్న స్కార్పియో గ్రామ శివారులోకి చేరుకొగానే అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో వాహనం నడుపుతున్న రాజశేఖర్(28) అక్కడికక్కడే మృతిచెందగా.. స్కార్పియోలో ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రున్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి చెందిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement