కొత్తపేట ఓమ్ని ఆస్పత్రి ముందు ఓ రోగి బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.
కొత్తపేట ఓమ్ని ఆస్పత్రి ముందు ఓ రోగి బంధువుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన శంకరయ్య (42) అనే వ్యక్తి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ రెండు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరగా బుధవారం ఉదయం మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడంటూ అతడి బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బుధవారం డిశ్చార్జ్ చేస్తామని చెప్పి మంగళవారం రూ.2 లక్షలు కట్టించుకున్నారని... తీరా బుధవారం ఉదయం మృతి చెందినట్టు చెప్పారని ఆరోపించారు. కాగా, కండిషన్ సీరియస్‌గా ఉందని, ఏమీ చెప్పలేమని ముందే స్పష్టం చేశామని, అవసరమైతే వీడియో కౌన్సెలింగ్ ఆధారాలను చూపిస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది.