రైలు నుంచి పడి వృద్ధురాలి మృతి | old woman died in rr district | Sakshi
Sakshi News home page

రైలు నుంచి పడి వృద్ధురాలి మృతి

Apr 23 2015 12:45 AM | Updated on Sep 28 2018 3:39 PM

ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందింది.

తాండూరు : ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ సంఘటన బుధవారం ఉదయం ధారూరు-రుక్మాపూర్ రైల్వేస్టేషన్‌ల మధ్యలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ రాజు కథనం ప్రకారం..ధారూరుకు చెందిన హరిజన్ పోచమ్మ(64) పని నిమిత్తం బుధవారం ఉదయం ధారూరు నుంచి తాండూరుకు ప్యాసెంజర్ రైలులో బయలుదేరింది. మార్గం మధ్యలోని ధారూరు-రుక్మాపూర్ స్టేషన్‌ల మధ్యలో ఆమె ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వేస్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement