నల్గొండ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు.
నల్గొండ: నల్గొండ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అరవపల్లి మండలం నాగారం గ్రామం వద్ద లారీ ఢీకొని అవిలయ్య(65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.