బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న ఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది.
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
Nov 27 2015 12:01 AM | Updated on Sep 3 2017 1:04 PM
మెదక్: బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్న ఘటన మెదక్ మండలం గాజిరెడ్డిపల్లిలో గురువారం చోటు చేసుకుంది. సీడీపీఓ విజయలక్ష్మి కథనం ప్రకారం...గాజిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఉప్పలం బొందయ్య-బాలమ్మ దంపతుల కుమారుడైన కుమార్(18)కు అదే మండలం హవేళి ఘణాపూర్‌లోని ఓ 18 యేళ్ల బాలికను ఇచ్చి వివాహం చేసేందుకు ఇరువురు తల్లిదండ్రులు సిద్ధపడ్డారు.
విషయం తెలుసుకున్న సీడీపీఓ విజయలక్ష్మి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొని బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఇరువర్గాల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వయస్సు నిండకుండా పెళ్లి చేస్తే శారీరకంగా, మానసికంగా అనేక అనర్థాలు ఏర్పడి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులతోపాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement