బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్‌ | Karnataka first in child marriages | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాల్లో కర్ణాటక ఫస్ట్‌

Aug 3 2024 5:51 AM | Updated on Aug 3 2024 5:51 AM

Karnataka first in child marriages

రెండు, మూడు స్థానాల్లో అసోం, తమిళనాడు 

ఏపీలో కేవలం 26 మాత్రమే 

పార్లమెంట్‌లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వెల్లడి

సాక్షి, అమరావతి: దేశంలో కర్ణాటక, అసోం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి శుక్రవారం లోక్‌సభలో వెల్లడించారు. 2022లో దేశంలో 1002 బాల్య వివాహాలు జరిగినట్లు ఆమె తెలిపారు. 

బాల్య వివాహాల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వీటిని నిరోధించేందుకు చట్ట ప్రకారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఏపీలో 2022లో కేవలం 26 బాల్య వివాహాలు నమోదయ్యాయని చెప్పారు. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా బాల్య వివాహాల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకుంది. రక్తహీనత సమస్యను అధిగమిస్తే బాల్యవివాహాలను నివారించడం సాధ్యమనే లక్ష్యంగా గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బాల్యవివాహాలు చేసే అవకాశం ఉన్న వారికి ముందుగానే గుర్తించి, నివారించడంతో పాటు కేసులు కూడా నమోదు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement