దేశమంతా తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయవైపే చూస్తోందనీ, ఇందులో భాగంగా 45 వేల చెరువులను పునరుద్ధరించి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో సమానంగా 265 టీఎంసీల నీటిని అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దేశమంతా తెలంగాణలో చేపడుతున్న మిషన్ కాకతీయవైపే చూస్తోందనీ, ఇందులో భాగంగా 45 వేల చెరువులను పునరుద్ధరించి, నాగార్జునసాగర్ ప్రాజెక్టుతో సమానంగా 265 టీఎంసీల నీటిని అందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. నీటిపారుదల శాఖ ఉద్యోగులంతా ‘ఆఫీసులే ఇండ్లు-చెరువులే కార్యాల యాలు’గా మార్చుకుని రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని గురువారం హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మిషన్ కాకతీయ సదస్సులో హరీష్‌రావు మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ నాలుగు నెలల్లోనే పూర్తి చేయడంతోపాటు వెంటనే నీరందించవచ్చన్నారు. త్వరలోనే గోదావరి నది డిజైన్ కార్యాలయాన్ని కరీంనగర్‌లో, కృష్ణా నది డిజైన్ కార్యాలయాన్ని నల్లగొండలో ఏర్పా టు చేయనున్నట్టు హరీశ్‌రావు తెలిపారు. కాగా, ప్రాణహిత-చేవెళ్ల ఎత్తు తగ్గించబోతున్నామంటూ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్ రావు కొట్టిపారేశారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ప్రభుత్వం బంగారు తెలంగాణ కోసం ఉద్యమకమిట్‌మెంట్‌తోనే ముందుకు వెళు తోందన్నారు. తెలంగాణ సాధించాలనే తపన తోపాటు చట్టసభల్లో కాలుపెట్టాలనే తన కోరిక నెరవేరిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు.


