అసెంబ్లీ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ యత్నం

NSUI Student Union Protest Infront Trys Meet To Telangana Assembly For Inter Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ తప్పిదం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్‌ విఫలమైందంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫలితాల వెల్లడిలో తప్పులకు కారణమైన వారిపై చర్యల విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటర్‌ ఫలితాల్లో తప్పిదాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top