'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా' | Now iam in khammam, will attend to ACB enquiry, says sandra venkata veeraiah | Sakshi
Sakshi News home page

'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'

Jul 4 2015 4:40 PM | Updated on Aug 17 2018 12:56 PM

'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా' - Sakshi

'ఖమ్మంలో ఉన్నా.. విచారణకు హాజరవుతా'

ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.

ఖమ్మం: ప్రస్తుతం తాను ఖమ్మంలోని తన ఇంట్లో ఉన్నానని, ఏసీబీ విచారణకు హాజరవుతానని సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో గడువులోగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లి విచారణకు సహకరిస్తానని సండ్ర తెలిపారు.

శనివారం ఏసీబీ అధికారులు సండ్రకు మరోసారి నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ హైదర్గూడలోని సండ్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు.. ఇంట్లో ఎవరూ లేకకపోవడంతో గోడకు నోటీసు అతికించి వచ్చారు. సోమవారం సాయంత్రం 6 గంటలలోగా విచారణకు హాజరుకావాలని సూచించారు. ఈ నేపథ్యంలో సండ్ర స్పందించారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ గతంలో సండ్రకు నోటీసులు ఇచ్చినా అనారోగ్యం కారణంగా హాజరుకాలేకపోయినట్టు సండ్ర చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement